While a controversy rages over "Padmavati", the Central Board of Film Certification has returned filmmaker Sanjay Leela Bhansali's application citing "technical deficiencies" in it, likely delaying its release. <br /> <br />సృజనాత్మకత కలిగిన దర్శకుడిగా పేరు ప్రఖ్యాతులు ఉన్న సంజయ్‌లీలా భన్సాలీ నిర్మించిన 'పద్మావతి'కి షూటింగ్ ప్రారంభం నుంచే కష్టాలు చుట్టుముట్టాయి. వచ్చేనెల ఒకటో తేదీన విడుదల కానున్న ఈ సినిమాను నిషేధించాలంటూ రాజ్‌పుత్ కర్ణిసేన చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ సినిమా రాజపుత్రులను కించపరిచేలా ఉన్నదని పేర్కొంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాజస్థాన్ లోని ఛిత్తోడ్ గడ్ కోట వద్ద నిరసన కాల్పులు జరిపే వరకూ వెళ్లింది. గతంలో సినిమా షూటింగ్ ప్రారంభం నుంచే ఈ సినిమా వివాదాల్లో చిక్కుకున్నది. అటువంటి చిత్రాల భారీన 'పద్మావతి' చిత్రం ఇప్పుడు అలాంటి మూకల బారిన పడింది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో వేసిన సెట్‌లోకి చొరబడి ఆ సెట్‌నూ, విలువైన పరికరాలనూ ధ్వంసం చేయడంతోపాటు భన్సాలీపై దౌర్జన్యం చేశారు. ఆ తర్వాత షూటింగ్‌ను మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు మార్చుకుంటే అక్కడా సెట్‌కు నిప్పు పెట్టారు. <br /> <br />